ఓమ్ నమ:శ్శివాయ నమ:


కోట్లాది హృదయాలలో కొలువున్న సామి…
కోరి కొలిచితే పలికేటి బంగారు సామి…
అందుకోవయ్య కార్తీక మాసపు సంధ్యా దీపాల హారతులు…
వినవియ్య..సుస్వరముతో ఆలపించు నీ భక్తి గీతాల స్వరజతులు…
శ్రీశైల మల్లికార్జునం మనసాస్మరామి…
ఉజ్జయిని కాళేశ్వరం..శిరసాం..నమామి..!!కో
పుడమిపై కనిపించు ఎన్నెన్నో నీ దేవాలయాలు…
కావయా శంకరా…అవి నీ హృదయాలయాలు…
చెంతకొచ్చిన వారి చింత తీర్చేటి ఆ దివ్య ఆలయాలు..
చిరునగవుతో ఆహ్వానించి ఆశీర్వదించి పంపు నీ ప్రేమాలయాలు..
వరమాయెరా శంకరా..నీ గుడి గోపురాలు..
మా మనసులాయే శంకరా..శివ మందిరాలు..!!కోట్లాది!!
పవిత్ర కార్తీక మాసాన …
మనసార నిను కొలుచు చున్నామయా…
ప్రతిదినము మరువక..
ఏదో ఒక రూపాన నిను తలచుచున్నామయా….
కాస్తైన నీ కరుణ పొందాలని…
కార్తీక మాసాన నీ చరణాల సుమమునవ్వాలని…!!కోట్లాది!!
పాహిమామ్..పాహిమాం.. శివశంకరా… పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..అభయంకరా.. రక్షమామ్..