ఓమ్ నమ:శ్శివాయ నమ:


కంటిరా ముక్కంటి…నీ దివ్య సౌందర్యమును…
కనుగొంటిరా..ఆ చూపులో నీ ప్రేమభావమును…
కృతజ్ఞతా భావముతో ప్రణమిల్లుతోందయా..మా హృదయము..
అభద్రతా భావమెరుగక సాగుతోందయా మా జీవన ప్రయాణము..!!కంటి!!
ఒక్కరైనా ప్రస్తుతించక కదలగలరా నిను దర్శించుకొని ఎప్పుడైనా…
ఏ ఒక్కరైనా మనగలరా..నిను మరచి పొరపాటునైనా ఈ జగానా….
అంతలా అపురూపమవుతావు..భక్తజనులందరికి
పేగు బంధములా అనిపించుతావు..దర్శించుకొన వచ్చిన ప్రతి ఒక్కరికీ…!!కంటి!!
తరతరాలుగా పెద్దలు చెబుతూనే వున్నారు, వింటూనే ఉన్నాము…
ఆది మధ్యాంతరహితుడు ఆది శంకరుడే మనకు అండ అని…
నరనరాలలో జీర్ణించుకొనిపోయి జీవిస్తూ ప్రార్ధించుచున్నాము..
పరమేశ్వరా..నీ కనుసన్నలలో మెలుగు వరమిమ్మనీ..!!కంటి!!
పాహిమాం…పాహిమాం..శివశంకరా.. పాహిమాం..
రక్షమాం..రక్షమాం..అభయంకరా.. రక్షమాం…