ఓమ్ నమ:శ్శివాయ నమ:

19.11.2021
నీలాకాశాన..ఆ నిండు చందమామ..
నీలి మబ్బులను దాటి కదలి వచ్చింది కానరా..జంగమా..
ఇచ్చేనయా కార్తీక పున్నమిన వెండి వెన్నెల హారతి…
కైలాసవాసుని దర్శించుకొని పొందమని కోటి జన్మల సద్గతి..!!నీలా!!
పరిపూర్ణ చంద్రుడు వెలుగు కిరణాలను ప్రసరించుతున్నవేళ…
అవి నీపాదాలపై బడి పవిత్రమై, మరింత ప్రకాశమై కార్తీక పౌర్ణమిగ వెలుగొందు వేళ…
నీ ముగ్ధ ముఖారవిందములో ఎన్ని పున్నములో చెప్పసాధ్యమా జంగమా…
నీ ప్రేమ నయనాల భాష్యాన్ని వర్ణించి గ్రంధముగ వ్రాయ తరమా…!!నీలా!!
అత్యంత సుందరం..నీ దివ్య రూపం..
కని తరించనివారు ఎవరయ్య లోకాన…
అత్యంత మధురం. నీ నామ గానం…
విని స్మరియించని వారు..ఎవరయ్య ఈ జగాన..
నిను తలిచితే చాలు తీరేను కోర్కెలు అనంతం….
మనసారా…ఈశ్వరా అని కొలిచితే చాలు…తోడుగా వుండేవు మా జీవితాంతం…!!నీలా!!
పాహిమామ్..పాహిమాం.. అరుణాచలేశ్వరాయా..పాహిమామ్
రక్షమాం..రక్షమాం..ఉజ్జయినీ శ్రీ మహా కాళేశ్వరా రక్షమాం…