ఓమ్ నమ:శ్శివాయ నమ:

04.11.2021
పర్వదిన శుభవేళ సొబగులతో మెరిసిపోతున్న చంద్రమౌళీ….
నిను గాంచిన మా కనులకు ఇదేకదా నిజమైన దీపావళి…
అత్యంత సుందర రూపము మాకు ఆనంద దాయకమాయే…
పండుగవేళ మా మనసు నీతోటి మమేకమాయె…!!పర్వ!!
తారాజువ్వలా నింగికెగసి కైలాస గిరిని చుట్టిరావాలని వుంది….
కాకరొత్తులు చేతబట్టుకొని కార్తీక మాసపు తొలి హారతులు ఇవ్వాలని వుంది…
ఇది అరుదైన వరము కాదయా నీవు దయతలిస్తే….
అరక్షణములో జరిగిపోదా నువ్వు ఇలా శలవిస్తే….!!పర్వ!!
అమవశీ తుది ఘడియన వెలిగించినామయా దీపాలను…
సమయమాసన్నమైనది సర్వేశ్వరుని సేవకు…వేగ రమ్మంటూ పిలిచేమయా కార్తీకమును….
తొలికోడి కూత లోగా అభ్యంగ స్నానాలు చేసి….
తొలిజాము లోపే నీ పూజాభిషేకాలు పూర్తిచేసి…
కార్తీకమాసాంతము వరకూ కాత్యాయినీ పతి…
కరుణించి ఒసగమని కోరేము నీ పాదాల చేరి సద్గతి….!!పర్వ!!
పాహిమామ్..పాహిమామ్…పరమేశ్వరా పాహిమామ్…
రక్షమామ్..రక్షమాం..సర్వేశ్వరా రక్షమామ్…