ఒక్కసారి మనసారా అంటే చాలు..ఓం నమ:శ్శివాయా అని.

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఒక్కసారి మనసారా అంటే చాలు..ఓం నమ:శ్శివాయా అని.
వేయి జన్మాల పాప పరిహారమేకదా శివయ్యా…
మరొక్కసారి ముదమారా అంటే చాలు..పరమేశ్వరా అని..
పాప పుణ్యాలనెంచక వరమిత్తువుకదా సాంబయ్యా..!!ఒక్కసారి!!

పరమపావనమైన పంచాక్షరీ మంత్రమును లోకానికిచ్చి..
శబ్దశోభితమైన ఆ దివ్య మంత్రాన్ని పఠించి…
ఆత్మ న్యూనతను తొలగించుకొమ్మనినావు..
జన్మధన్యతను పొందమనినావు..!!ఒక్కసారి!!

మీ ఆత్మ విశ్వాసమే నేనందువు…
ధృఢసంకల్పమే దైవ బలమందువు…
వెరవక,  వెనకడుగు వేయక సాగి పొమ్మందువు..
బెదరక,భయపడక నా పైన భారమేయమందువు…
ఏ కన్ను కన్నీరు కార్చినా చూడలేవయ్యా…
రెప్పదాటి జాలువారేవరకూ ఆగలేవయ్య..
కరుణించి కాపాడతావు క్షణములో…
వెనకుండి గెలిపిస్తావు..జీవన రణములో…!!ఒక్కసారి!!

పాహిమాం…పాహిమామ్..శివశంకరా... పాహిమాం…
రక్షమాం..రక్షమాం…అభయంకరా..రక్షమాం..

Leave a Comment

Scroll to Top