చూడాలనిపిస్తావు శంకరా…లక్ష సార్లైనా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

చూడాలనిపిస్తావు శంకరా…లక్ష సార్లైనా…
సేవించుకోవాలనిపిస్తావు శశిధరా…సవాలక్షసార్లైనా..
నీ పదము తాకాలని వుంటుంది పూట కొక్కసారైనా..
“పరమేశ్వరా పాహిమాం” అని గట్టిగా గళము విప్పాలని వుంటుంది హిమనగముపైన..
ఏమనాలో తెలియని ఈ భక్తి భావనలని…
భావించి దీవించరా…మా ఆరాధనలనుకొని..!!చూడా!!

ఎందుకు పుట్టిస్తావో మాలోన నీపైన భక్తిని…
చెప్పలేరెవ్వరూ నీ తలపుని…
ఏ రీతి కరుణింతువో ప్రతి ప్రాణిని..
ఎరుగంగలేరెవ్వరూ నీ మనసుని…
అనుక్షణము నీ భక్తులను వెతుకుకొనుచుంటావు..
అడగకనే వరములిచ్చి ఆదుకుంటావు…
కలడు..కలడంటూ శివుడు జనులు మురిసిపోయేరు…
కలలు నిజము చేయు నిటలాక్షుడు మా ప్రాణమందురు…!!చూడా!!

పాహిమామ్… పాహిమాం… శివశంకరా పాహిమాం…
రక్షమామ్..రక్షమాం..అభయంకరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top