ఓమ్ నమ:శ్శివాయ నమ:


అడగనా శంకరా…ఒక చిన్న వరముని…
నిన్నడగనా హర హరా…మము దీవించ రమ్మని…
అడగందే పెట్టదట అమ్మైనా బువ్వని…
నిన్నడగకనే ఇస్తావట వరముల విరి కొమ్మని…!!అడ!!
మూడు కళ్ళ శంకరా…జగములేల కదలి రా. .
పాపభీతి లేని మనుజులము జన్మ పరమార్ధము తెలుపరా…
విశృంఖల పోకడల మరుభూమి లోనప్రాణమున్న బొమ్మలం..
ఈ పుణ్యభూమి కంట తడిని చూడలేని కళ్ళు వున్న కబోదులం..!అడ!!
మా గుండె తలుపు తట్టి మొద్దు నిదుర లేపురా…
పెడదారి పట్టిపోకుండా చేపట్టి ఆపరా..
కలనైన కాంచనట్టి ధర్మనిధులను..
ఇన్నాళ్ళ నుండి ఎరుగనట్టి సత్కర్మ విధులను..
వినియోగించునట్లు చేయరా…విశ్వమానవాళికై…
నిర్వర్తించునట్లు చేయరా… చిత్తశుద్ధితో నీసేవా కార్యకర్తలై…!!అడ!!
పాహిమామ్..పాహిమామ్..శివశంకరా పాహిమాం.
రక్షమాం..రక్షమాం..అభయంకరా రక్షమాం…