ఓమ్ నమ:శ్శివాయ నమ:


చాలదయా శంకరా…నిను వర్ణింప నా భాషా పరిజ్ఞానము..
సరిపోదయా హర హరా..నాకున్న అరకొర విజ్ఞానము..
అరక్షణము ఆశీనురాలైతే చాలు నా నాల్కపై ఆ తల్లి శారద..
ఆనందాశృవులతో అనర్గళముగా ప్రస్తుతించాలన్న చాన్నాళ్ళ నా కోర్కె తీరదా…!!చాల!!
క్షుద్భాధలే లేని లోకానికి అధిపతివై..
సుభిక్షమైన ప్రేమ సామ్రాజ్య పరిపాలనా చక్రవర్తివై…
పాలించుతూ అభయహస్తముతో ఆశీర్వదిస్తుంటే..
కరుణ నేత్రాలతో భక్తుల హృదయాలలో వెన్నెలలు కురిపిస్తువుంటే…!!చాలదయా!!
మరుజన్మ వుంటే మళ్ళీ నీకోసమే పుట్టాలని…
ఏ జీవిగా పుట్టినా నీసేవలోనే బ్రతుకు పండాలని…
వరమివ్వరా శంకరా..కాదనక
వరదాయక..మా కోర్కె తీర్చునది నీవు గాక ఎవరిక…!!చాలదయా!!
పాహిమాం..పాహిమామ్..పరమేశ్వరా పాహిమామ్.
రక్షమామ్…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం.