ఓమ్ నమ:శ్శివాయ నమ:


ఒకే ఒక వరము కోరేము శంకరా…
నిలిచిపోనిమ్మని నీ రూపమును మా కళ్లలో హర హరా..
రెప్ప వాల్చి తెరిచినపుడు తరలిపోకుండా..
తెలియక తప్పు చేసినా మన్నించి, నను వీడి పోకుండా..
చెంతనే ఉండరా..చితా భస్మ ధరం దేవా..
ఏ చింతలూ దరి రానీక మహాదేవా…!!ఒకే!!
అవగాహనా లేమితో చేయు ఆరాధనలనీ…
మన్నించి తెలుసుకో..అవి మా హృదయ భావనలని..
కృతజ్ఞతా భావాలు గంగలై కొలువుండు నిత్యమూ మా కళ్ళలో..
దర్శించు ప్రతిసారి జల జలా రాల్చి అడుగిడును నీ గుడుల ముంగిళ్ళలో..
తన్మయత్వము చెందిన ఈ తనువుతో…
అడుగు పడదయ్య శంకరా…తిరిగెళ్ళి పోవాలంటే ఇంటికి గుండె బరువుతో..!!ఒకే!!
వస్తాము…వస్తాము..నీ గుడికి ఎన్ని సార్లైన వస్తాము…
వందల,వేలసార్లైనా నిను దర్శించుకొని మురిసిపోతాము
ఇచ్చావు మాకు ..పున:దర్శన భాగ్యమిన్నిసార్లని..
కనికరిస్తావు…మళ్ళీ ఇచ్చి పున:దర్శన వరముని…
కాల చక్రము గిర గిరా తిరిగి వయసు మీద పడి నీ గుడికి రాలేకపోయినా…
వరమియ్యరా శంకరా…వయసెరుగని మనసుని నీ ధ్యాసలోనే వుంచి బ్రతకనియ్య త్రినయనా….!!ఒకే!!
పాహిమామ్..పాహిమాం… శివశంకరా…పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..అభయంకరా.. రక్షమామ్..