ఓమ్ నమ:శ్శివాయ నమ:

30.09.2021
పలుకవేమి? పలుకవేమి? శంకరా…
ఒక్క పలుకైనా పలుకవేమి నిన్నడుగుతుంటే ఈశ్వరా…
ఏల మమ్ము నీదు మాయలోన దించావు..
మమ్మేల రేయిపగలు నీ ధ్యాస లోన ఉంచావు..!!పలుక!!
తప్పటడుగు వేయకుండ మా వెంట ఉందుకా?
మాకు తెలియకుండ మా నీడలాగ ఉండి మమ్ము కాచుకుందుకా?
నీ బిడ్డలు చేయి జారిపోకుండా పట్టుకొనుటకా?
మా మనసులు దిగజారిపోకుండా కాపాడుకొనుటకా?
ప్రశ్నమీద ప్రశ్నలు మనసును తొలిచేస్తుంటే…
నీ ప్రతిమ ముందు నిల్చొని కరములు జోడించి ప్రార్ధించుతుంటే..!!పలుక!!
పాప భీతి గుర్తెరుగక ప్రవర్తించినందుకా..
పరుల పట్ల సానుభూతి చూపనందుకా..
ఏదైనా,ఏమైనా నీ మాయలోన పడ్డాక…
ఆసాంతం..నీ ధ్యాసే మా శ్వాసలాగ మారాక…
పొందమా శంకరా..నీ ప్రేమను కనిపెంచిన తండ్రిలా…
మేము మారిపోమా నీ కరుణతో కడిగిన ముత్యాల లా…
ఇకనైనా పలుకరా శంకరా…
మా అజ్ఞానమును మన్నించుము హర హరా..!!పలుక!!
పాహిమామ్…పాహిమామ్..శివశంకరా.
రక్షమాం..రక్షమాం..అభయంకరా రక్షమాం..