


కలుగునయా శంకరా…శుభ పుణ్య ప్రకంపనలు ప్రతి తనువులో…
చేరగనే హర హరా…నీ గుడి ప్రాంగణ పరిధిలో…
అనుకోని ఆ దివ్య పరిణామమే..
చేయిస్తుంది ప్రతి వారి చేత నీకు ప్రణామమే….
శంభో హరా శంకరా..శివ శంభో హరా శంకరా…
వందే గౌరీ వరా..శివం శంభో హరా శంకరా..!!కలుగు!!
వేదమంత్రాల నడుమ నిరాకారా చేస్తుంటే గుడిలోన నీ పూజలు…
తిలకించుతూవుంటే తెలియవయా అసలు ఎన్నైనవో పొద్దులు..
గంగ స్నానాలు చేయిస్తుంటే నీకు మా గుండె లాంటి నీ గర్బగుడిలోన…
మా కనుల నీలి మేఘాలు కురిపించెనయా భక్త్యానంద భాష్పాల జడివాన…
పుట్టి ఉండరేమో పుడమిపై వర్ణించ ఈ అనుభూతిని…
కోరుకుంటారేమో ప్రతి ఒక్కరూ తమ మదిలోన నిలిచిపోవగా నీ గురుతుగా ఈ దివ్య స్మృతిని…
శంభో హరా శంకరా…శివ శంభో హరా శంకరా…
వందే గౌరీ వరా..శివం వందే శంభో శంకరా…!!కలుగు!!
నీ ఎదుట ఆశీనుడై నందీశ్వరుడు చూస్తుంటే ఎన్నెన్నో నీ పాలాభిషేకములు…
మా నుదుట ఆ రాత ఎప్పుడనిపిస్తుంది చూస్తుంటే ఆ దివ్య దృశ్యములు…
ధారా పాత్రనై నీ శిరమున జలము జాలు వార్చుచూ…
తడిసి పోతుంటే నీ ప్రతిరూపము జన్మ ధన్యమైనదని నా కళ్ళు చెమర్చుచూ….
తరించు భాగ్యమ్ము నివ్వవయా శంకరా…
సేవించు తరుణమియ్యవయా హర హరా…
పాహిమామ్…పాహిమామ్… శివశంకరా పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..అభయంకరా రక్షమామ్..