ఏ భావమని పోల్చను పరమేశ్వరా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఏ భావమని పోల్చను పరమేశ్వరా…
ఇది ఏ రూపమని తేల్చను జగదీశ్వరా…
సామాన్యుడిని నేను…లేదు కనుగొనగ విజ్ఞానము….
పామరుడిని నేను…లేదు వర్ణించ భక్తి కవితా పరిజ్ఞానము…!!ఏభావ!!

కనులు మూసుకొని ప్రార్ధించుకుంటుంటే అంతరాత్మతో…
కాత్యాయనీ సుత సమేత వై సాక్షాత్కరించావు సంపూర్ణ పరివారముతో…
తొలగనున్నవని మబ్బులు…
తెరవకన్నవి నా కన్నులు….
మనసు లిపితో మాటాడమంటూ…
మౌనమునివై వేడుకొనమంటూ…
సూచించెనవి నాలోన వుంది నువ్వేనంటూ…
తెలియజెప్పినవవి ఈ ప్రాణభిక్ష నీదేనంటూ…!!ఏ భావ!!

ప్రార్ధించుచున్నాను పరమేశ్వరా…
పనిచేయనీ నీ సేవకై ఈ తనువులో ప్రతి అవయవము…
అర్థించు చున్నాను సర్వేశ్వరా…
ప్రవహించనీ అణువణువునా నీ దివ్య నామామృత మిళిత రుధిరము….
అర్పించులాగున…ఏ సేవకైనా ఈ దేహము…
సమర్పించులాగున తుది శ్వాస వరకూ నీ ధ్యాసలో ఈ ప్రాణము..

పాహిమాం…పాహిమామ్..పరమేశ్వరా...పాహిమాం..
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా..రక్షమాం…

Leave a Comment

Scroll to Top