వికసించే పుష్పాలు నీ పద పూజకొరకు శివశంకరా…

వికసించే పుష్పాలు నీ పద పూజకొరకు శివశంకరా…
విరజిమ్మే మధుర పరిమళములు ఆహ్లాదించగా నీ మనసు ఆఘ్రాణించరా…
పాలించరా ప్రసన్నముగ ముల్లోకములను …
పరిశీలించి తీర్చేయరా మా చిరకాల కోరికలను…
అవధానమే చేతువో…వరదానమే అందువో…
కనికరించరా కరుణామయా..
ఉమా మహేశ్వర ప్రేమ రూపాయా..!!విక!!

కనరా శంకరా..నీకనుల ముందున్నాయి వివిధ ఫల,పత్ర, పుష్పాలు…
వినరా హర హరా..వినసొంపుగనున్న మా నానావిధ మంత్ర పుష్పాలు…
పావనమైన నీ గుడి ప్ర్రాంగణములో….
నీ కీర్తనలు శంకరాభరణ రాగములో….
మమ్ము మేమే మైమరిచిపాడాలి…
మమేకమై నీ మనసు తాకి చూడాలి…!!విక!!

తినరా త్రినయనా…మా తీయ్యనీ పాయసాన్నాలు తిన్నడి ఎంగిలి మాంసమనుకొని…
ఇవ్వరా హృదయాన.. కాసింత చోటు కన్నప్పకిచ్చిన చందముగ మాక్కూడా అని…
మా జీవిత పద పుస్తక పుటలలో మొదటి చరణాలన్ని నీ సేవకోసమే వ్రాసుకున్నాము….
వారసత్వపు అద్వైత స్వర సంపదల “ఓం నమశ్శివాయ” పంచాక్షరీ మంత్రమును మదిలోన అలవాటు చేసుకున్నాము…
నిను చూచు సమయాన తెలియకనే స్పందించును నా మనసు…
నన్నడగకనే చేయు నీ బీజాక్షరలతో నిత్యమూ తపసు….

పాహిమాం….పాహిమాం…శివశంకరా పాహిమాం..
రక్షమాం..రక్షమాం..అభయంకరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top