చాలునా…చాలునా..చాలునా…ముక్కంటీ….. మూడు కన్నులు చాలునా…

చాలునా…చాలునా..చాలునా…ముక్కంటీ….. మూడు కన్నులు చాలునా…
ఏలగా…. ముల్లోకములను ఏలగా..
మూడు కన్నులు  నీకు సరిపోవునా?
చాలకుంటే   చెప్పరా… ఇచ్చేము నువ్వడిగితే మా కళ్ళనీ…
తీసుకొని నీ కళ్ళతో కలిసి చూడరా దీన జనుల కడగళ్ళనీ…!!చాలునా!!

ఆశతో ఎదురు చూచుచున్నారాయా వారు కరుణించకపోతాడా కరుణామయుడనీ…
భక్తితో ప్రార్ధించుచున్నారాయా వారు  ప్రేమతో పలకరించే పరమేశ్వరుడు కలనైన కనిపించడా అని…
వమ్ముచేయకయా శంకరా..నమ్మకములను…
కోసుకొచ్చేమయా హర హరా నీ పూజకు బ్రహ్మ కమలములను…!!చాలునా!!

నీ కళ్ళ కరుణ కిరణాలు మా పేద వాకిళ్ళ గడపలను తాకితే….
హృదయభారాన మనుగడను సాగించుతూ నిస్తేజముగనున్న మా ఎద తలుపులను తట్టితే…
ధన్యమే కదా శివశంకరా…మా జీవితాలు…
నీ పుణ్యమే కదా హర హరా…బ్రతుకుతున్నామంటే మరచి పోయి మా గతాలు…
కైలాసగిరి దొరా…కాంక్షించరా…
నీ ధ్యాసలోనే  నిత్యమూ మేముండటను ఆకాంక్షించరా…

పాహిమాం…పాహిమామ్..శివశంకరా... పాహిమాం…
రక్షమాం..రక్షమాం…అభయంకరా…రక్షమాం…

Leave a Comment

Scroll to Top