కొండ జాతికి అండవై…

ఓమ్ నమ:శివాయ నమ:🙏🙏🙏

కొండ జాతికి అండవై…
గిరి పుత్రులకు నువు దైవమై…
కోయదొరవై అవతరించావా…
శ్రీ శైలవాసా..కోన దొరలా ప్రకాశించావా…

కారడవి తల్లి ఒడిన పెరిగే బిడ్డలు…
ఏ కపటమెరుగని ఏకలవ్యుని గురుతులు..
నిన్ను కొలిచి మనగలుగుతోందిరా శివా ఆ మన్యము…
చెట్లు చేమల మధ్య బ్రతికే బడుగు జీవులకివ్వరా శివ ఇక పుణ్యము…
!!కొండ!!

చేసుకోని తేలేరురా శివా.. నైవేద్యముగా నీకు కమ్మనీ పాయసములు…
మోసుకొని తేగగలరురా శివా… కొండకోనలు తిరిగి నీ కొరకు పనసకాయలు…
మనసార నీకు పూజ చేయగా తుంచుకొని రాగలరు ఎన్నైనా మారేడు దళ కొమ్మలు…
మాసామి నువ్వని నిను వేడుకొనగా పట్టుకొని రాగలరు ఎన్నైనా పుట్ట  తేనేల పట్టుకొమ్మలు…
స్వార్థమెరుగని సేవలో చూడరా శివా వారి భక్తిని…
అత్యాశలంటే తెలియని ఆ పసిడి మనసులకివ్వరా శివా ముక్తిని…

పాహిమామ్…పాహిమామ్..శివ శంకరాయ …పాహిమామ్…
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా య…రక్షమామ్…

Leave a Comment

Scroll to Top