ఓం నమశ్శివాయనమ:


ఏలరా…రుద్రాయ ఈ ఉగ్ర రూపము?
నీకేలరా…కాళాయా ఈ తీవ్రవీక్షణము?
చెప్పరా శంకరా…మేమేమి చేయాలి?
మనసిప్పరా శంకరా…ఏమేమి చేయాలి?
నీ మనసు లోతులను మేమెరుగగలమా శివా…
అంచనాలను వేయ మేము సరితూగగలమా శివా…
గడ్డి పరకలు లాంటి జీవితాలు రా మాయి…
దుర్భుద్ది కి లోనై నల్ల మరకలు పడి మసి బారి ఉన్నాయి…
ఇవ్వరా శివా వరముగా నిను పూజించు అర్హత…
చిత్తశుద్దితో నిత్యమూ నిను సేవించుటకు కావలసినంత దక్షత…
చేరువవవనీ శివా మమ్ము నీ
హృదయ స్థానానికి…
దూరమవనీ శివా మమ్ము భవ బంధ భారాలకి…
విహరించనీ మమ్ము ధ్యానించుతూ అద్వైత లోకాల లో…
నివసించనీ మమ్ము, నిను స్మరించుతూ నీ మనసు కైలాస శిఖరాలలో…
పాహిమామ్..పాహిమామ్..పార్వతీ ప్రియ రూపాయ పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..వీరభద్ర స్వరూపాయ రక్షమామ్…