ఓం నమశ్శివాయనమ:


సిద్ధి బుద్ధి వినాయకా…
సద్భుద్ది జ్ఞాన ప్రదాయకా…
వందనమిది గణేశా..అందుకోరా గణేశా…
త్రిశూల నామ తిలకా…విశాల కర్ణ వినాయకా…
వీనులారా వినరా…మా వెతలనన్ని వినరా…
గం గం గణేశా…గంగాధర గణేశా…
జై..జై..గణేశా…జయమునివ్వు గణేశా…
ఏక దంత వక్రతుండ…నీకు వేల దండాలు…
మా దరికి రాక చూడవయా ఏలాటి గండాలు…
ప్రధమ పూజలందుకొనె పార్వతి సుతుడా…
ప్రధమ కర్తవ్యముగ భావించి మమ్ము కావు విఘ్న నాధుడా…
మాతా పిత సేవలోన మురిసినోడివి…
ముద్దు గణపయ్యగ వారి మనసు గెలిచి నోడివి…
మార్గమొసగి నడిపించరా మమ్ము కూడా నీ బాటలో…
తలిదండ్రుల ప్రేమ పొంది ధన్యుడవగ బ్రతుకు బాటలో…
పాహిమామ్..పాహిమామ్..విఘ్నేశ్
రక్షమామ్…రక్షమామ్..సర్వేశ్