ఓంనమఃశ్శివాయనమః


పాల సంద్రమున శేషతల్పము పై పవళించు పద్మనాభుడు నేడు…
నీ ఫాల నేత్రమున గోవింద నామములు కనగ గురుతుకొస్తున్నాడు..
ఏక కాలమున లోకేశ్వరులని కనిన భాగ్యమిస్తివి…
అదే సమయాన శివ కేశవులొకటేనని భావన కలిపిస్తివి…
తరించితిమయా శివా చూసి శ్రీ విష్ణు నామాలు…
పఠించితి మయా శివా మీ ఇరువురి అష్టోత్తర నామాలు…
నీ విశాల నేత్రాల తీక్షణపు వీక్షణములు..
చూసి కాలిపోవా శివా… మా లోని దుర్గుణములు…
ఏ లోహమూ కలవని పసిడిలా…
ఏ పాపమూ ఎరుగని పసివాడిలా…
మార్చేయరా శివా…మా మనసుని
తలచుకుంటూ బ్రతికేయగా తను నీ ఊసుని….
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా..
తండ్రివై పాలించు జగదీశ్వరా…