ఓంనమఃశ్శివాయనమః 


ఏమాయరా..చిరునగవు నీ మోములో శంకరా…
నేడు కనమాయ ఆ కళలు నీలోన హర హరా…
చింతనలు తీర్చుకొనంగ నీ చెంతకొస్తే…
వెతలను వివరించ నీ వద్దకొస్తే…
దిగాలుగా నువ్వు దర్శనంబిస్తే..
మా దిగులు తీర్చునది ఎవరురా శంకరా…
నిఘూఢముగ నువ్ సాక్షాత్కరిస్తే
మా గుండె గుబులును కడతేర్చునది ఎవరురా హర హరా…
భక్తి తో ఇచ్చేము నీకు కర్పూర హారతులు….
ఆర్తి తో చేసేము నీకు భస్మాభిషేకాలు..
ప్రసరించరా శివా…నీ దివ్య కాంతిపుంజములను..
చైతన్యమవనీ ఆ వెలుగు కిరణాలలో మా జీవితములను…
కడలి పై కురిసిన వాన చినుకును వేరు చేయుట కాదు..సాధ్యము
నిను నమ్మి కొలిచిన వారికి నీ అండ వుండునన్నది తధ్యము…
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా..
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా.