ఓంనమఃశ్శివాయనమః


శంకరా…శివ శంకరా…
ప్లవ నామ సంవత్సరము అడుగు పెట్టింది…
ప్రతి దినము మీకు శుభ దినముగా వుండునంటుంది…
పరమేశ్వరుని అండ కూడా మీకు ఉండునంటుంది…
నమ్మి కొలవండి..ఇక మీకు బెంగ దేనికంటుంది….
జగతికి శుభయోగ పంచాంగమును ఇవ్వరా శంకరా…
మా ప్రగతికి శుభ మంగళ ఉదయాలను ఇవ్వరా శంకరా….
ప్రతి మోమూ …వికసించనీ చిరునవ్వుతో….
నీ శిరము పై నెలవంకలా మురియనీ ఆ నగవుతో…
ఏ కష్టమూ ఎదురవ్వనీ వరమియ్యరా శివా…
ఏదానికీ భయపడని ధైర్యమియ్యరా శివా…
సుఖ సంతోషాల తో వెల్లివిరిస్తుంటే మానవాళీ…
తీరును కదరా నీ మనోభీష్టము చంద్రమౌళీ…
పాహిమాం..పాహిమాం..శంకరా…
ప్లవ నామ సంవత్సర ఉగాది దీవెనలను మాకివ్వరా శంకరా….