ఏందిరా శంకరా…ఇదేందిరా శంకరా..

ఏందిరా శంకరా…ఇదేందిరా శంకరా..
దంతాలు బిగపట్టినట్లు..శత్రువులపై పగ బట్టినట్లు…
ఏలరా నిరాకారా నీకు ఈ భీకరాకార రూపము..
మనగలమా మేము మహిపైన ఉమాపతీ నీలోన చూసి ఈ భయానక ఉగ్రరూపము….
ఎన్ని సుమహారములేయవలెనో   చెప్పరా శివా నిను మేము శాంత పరచ….
ఇంకెన్ని ఫలహారములనుంచవలెనో  చెప్పరా శివా నీ కడుపు చల్లపరచ..
పరుగులెత్తి చల్లంగ ప్రవహించు గంగమ్మ తలపైన ఉన్నా…
ప్రేమపంచే మాయమ్మ గౌరమ్మ నీ ప్రక్కనే ఉన్నా…
శాంతమే కరువాయె శివా నీ మోములో…
ప్రశాంతతే  కనమాయె నీ చూపులో..
మణిమకుట మాణిక్యాలు
మేమడగమయ్యా శివా….
మనసున్న మారాజా..నీ చిరుమందహాసమే మేకోరుమయ్య శివా….
పాహిమాం…పాహిమాం..పార్వతి ప్రియ దేవరా శివా పాహిమాం…
రక్షమాం…రక్షమాం…రఘురామ ప్రియ రామేశ్వరాయ శివా…రక్షమాం..

Leave a Comment

Scroll to Top