జాలి చూపుల జంగమయ్య…

జాలి చూపుల జంగమయ్య…
జాగుసేయక కావుమయ్య….
శుభములొసగే శంకరయ్య…
శీఘ్రముగ దయ చూడుమయ్య…
వేల సార్లు పిలిచినా ఒక మౌన మునివై వుంటివి….
కరుణించమని విలపించినా మా కనులు తుడవక వుంటివి…!!జా!!

పాప కర్మల ఫలితమో…
ఏ పూర్వజన్మల శాపమో…
చేరకున్నవి మా వినతులన్నవి నీ మనసులోనికి శంకరా…
కడకిక మూగబోయి వేడుకున్నవి మన్నించమని శివ శంకరా…!!జాలి!!

ఇష్టముగ నిను కొలుచుచుంటి…
మా కష్టముల నెడబాయవా…
నిర్ధిష్టముగా సేవించుచుంటి…
నిటలాక్ష కరుణను చూపవా…
ఆపకుండా చేసెద నీ నామ స్మరణం శంకరా…
క్షణ మాలసించక చూప రా…నీ కరుణ నాపై ఈశ్వరా…!!జాలి!!

పాహిమాం…పాహిమాం….పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్ష మాం..

Leave a Comment

Scroll to Top