కొలువు తీరమ్మ కాత్యాయనీ…
నగవు సిరులను కురిపిస్తు శివుని సగభాగిని..
కాలుమోపమ్మ కరుణ వదనీ…
కొంగు బంగారమవునటుల ప్రేమ కమలాక్షి జననీ…
తల్లి…మా తల్లి అందుకో పూజ కుసుమాలను…
అమ్మ..మాయమ్మ గైకొనుము మంగళహారతులను…!!కొలువు!!
పగడాల పలువరుస వికసించగానే…
ఉదయించు లోకాలు నీ కరుణ తోనే…
బంగారు వర్ణాన నీ మేను కనగనే…
సురులు వల్లించు స్తోత్రాలు మా తల్లి నీవనే…!!కొలువు!!
శంకరుని మానసమున వెన్నెలవు నీవే…
ఈశ్వరుని హృదయమున దేవతవు నీవే…
పరమేశ్వరుని ప్రణయ చంద్రికవు నీవే….
కాళేశ్వరుని కావ్య కన్యకవు నీవే…
ప్రేమానురాగాల పుట్టిల్లు నీది..
తల్లి…నీ కరుణకు ఈ జగాన సాటి ఏది?…!!కొలువు!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరీ పాహిమాం…రక్ష మాం…రక్ష మాం..సర్వేశ్వరీ రక్ష మాం…