సర్ప భూషితాంగా శివశంకర…
నాగరాజ ప్రియ శంకరా…నాగేశ్వర…
ఎంత దయయో నీకు మిన్నాగుపై….
బేధ భావాలు లేవనుచూ ఏ ప్రాణిపై…
నాగేశ్వరా… నమః స్సుమాంజలులు నీకు…
శిరమొంచి చేయరా వందనములు సర్ప రాజములు నీకు…!!సర్ప!!
కాలకూటమును చిమ్ము కాళుడిని సైతము…
చేర దీస్తివి కదా నీ ప్రేమ ఎంత అద్భుతము….
మెడపైన ప్రాకుతూ నీ నామ స్మరణ చేస్తుంటే వాసుకీీ….
సంతసముతో పరవశిస్తువు కదా వందనములు నీ బంగారు ప్రేమకీ…!!సర్ప!!
చెట్టైన పుట్టైన కొలిచేను నిన్ను…
ప్రాణి ఏదైన భక్తితో తలచేను నిన్ను…
నీ దయ లేకున్న ప్రశ్నార్థకమే కదా మా మనుగడ…
నీ ఆజ్ఞ లేకున్న చీమైనా కుట్టునా సాంబశివుడా…
అందమైన నీ సృష్టిలో నాకునూ చోటిస్తివి…
నిత్యమూ నిను తలచుకొను భాగ్యమ్ము నా మనసుకూ ఇస్తివి…
!!సర్ప!!
పాహిమాం…పాహిమాం..నాగేశ్వర పాహిమాం…రక్షమామ్ రక్ష మాం…నాగచంద్రేశ్వరా రక్ష మాం…