ఏమి పూజ చేతు శివ శంకరయ్య..

ఏమి పూజ చేతు శివ శంకరయ్య..
నేనెట్లు నాగునవుతు శలవియ్యవయ్య…
ఏమి సేవ సేతు ఓ ఈశ్వరయ్య…
నే నెట్లు నంది నవుతు ఇక చెప్పవయ్యా…
మెడన హరమవ్వంగా నాగభూషణా…..
నీ వాహనమవ్వంగ నేను నంది వాహనా…!! ఏమి!!

కోసుకొస్తు నీకు మారేడు దళములు…
మరి మోసుకొస్తు నీకు కడవ గంగ జలములు…
సర్వ సంగ పరిత్యాగినవుతు శంకరా…
నా సర్వము నీవనుచు నమ్మి కొలుతు ఈశ్వరా…!!ఏమి!!

పొందెనెట్లో నాగు ఆ పుణ్య ఫలములు…
ఆ నంది కెట్లుదక్కో నీ దివ్య వరములు…
ఎంత సేవ చేసినాయో మూగ జీవులు…
నిన్నెంత తలచుకున్నాయో వన్య ప్రాణులు…!! ఏమి!!

పాహి పాహి పాహి పరమేశ్వరా శివా.. రక్ష రక్ష రక్షా సర్వేశ్వరా హరా…

Leave a Comment

Scroll to Top