అదిగో కనరే శంకరుని…
వరమియ్యగ వచ్చిన ఈశ్వరుని…
అనరే శంభుని మంత్రముని…
సత్వరమే పొందగ మోక్షముని…
శివ శివ శివ యని పలికిన చాలు…
కరిగించును ఈశుడు కర్మలు వేలు…!!అదిగో!!
చూడరే చక్కని ఆ చిరునగవుమోము..
కనులార్పక కొలిచిన వరము నొందేము…
ఇవ్వరే భక్తితో ఫలములను రెండు…
కలగన్న మన కలలు ఎన్నున్న పండు…
ఆశీస్సులందిస్తూ శివుడు ఆనందపడును..
భక్తులను దీవిస్తూ ఆ హరుడు సంతోషపడును…!!అదిగో!!
శివ నామ ధ్యానమే మనకు రక్ష…
ఆ తండ్రి సంపూర్ణ కరుణయే మనకు భిక్ష….
కొండంత కష్టాన్ని గోరంత చేయ ముందుగానే…
శివుడు గంగలా భావించు కన్నీటితో కాళ్ళు కడగగానే…
జాగుసేయక జంగముని కొలవరండి…
జారిపోయే క్షణము మరల రాదండి..
!! అదిగో!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్షమాం…