కోటి బిల్వార్చనలు చేసినా…
శతకోటి పుష్పార్చనలు చేసినా..
తీరునా నీ ఋణము శంకరా…
జన్మలెన్నైతే చాలునయ్య ఈశ్వరా…
శంభో హర శంకరా… మేముంటిమంటే పుడమిపై…
గంగాధర ఈశ్వరా…నీవు కొలువుండ బట్టే ధరణి పై…!! కో!!
అనంతమైన విశ్వాన్ని అనుక్షణం కాచేవు…
అభాగ్యులైన భక్తులపై అనురాగం చూపేవు….
వేడుకుంటే చాలు ఇచ్చేవు వేల వరములు….
దర్శించుకుంటే చాలు దక్కేను పుణ్యఫలములు…
ఇంతలాగా కరుణ చూపు కాత్యాయనీ హృదయమా…
కొండంత భక్తి తెలిపి నిన్ను కోలుచుకోమ జంగమా….!! కో!!
విరామమన్నది ఎరుగవు నీ మనసు ఎంత గొప్పది…
విశాల జగతి కోసం కరుణ ఊట బావి జలధది…
భక్తి చూపి తోడుకుంటె ఎంతైనా దొరకును…
మనసు పెట్టి వేడుకుంటే నీ దరికే చేర్చును…
గంగాధర…గౌరీ వర…ఆజ్ఞ నిమ్ము శంకరా…
శంభోహర…హే శంకర…నీ చరణ సుమమునౌతురా…!! కో!!
పాహిమాం…పాహిమాం… పరమేశ్వర పాహిమాం…రక్ష మాం..రక్ష మాం… సర్వేశ్వర రక్ష మాం…