అత్యంత సుందరం…శంకరుని రూపం…

అత్యంత సుందరం…శంకరుని రూపం…
పలుక శుభ తరుణమిది నమ: శ్శి వాయ మంత్రం…
ఆనంద భరితం..ఈశ్వరుని అనురాగ వీక్షణం…
ఇవ్వ తగు సమయమిది నివేదనల గ్రంథం…
సాష్టాంగ పడుతూ శివుని పాదాలపై..
కొలువుండ మనరే హరుని ఇలవేలుపై…!!అత్యంత!!

ఈశ్వరా… ఏ పాటి పూజలని నిందించమాకు…
మావి ఎంతోటి సేవలని విసిగించుకొనకు…
శంకరా…అసలు పూజించ తగువారమా చెప్పవయ్యా…
ఆ అర్హతలు మాకున్నవా నీవు తెలుపవయ్య…!!అత్యంత!!

జన్మ నిచ్చిన జంగమా…నీ పైన ధ్యాసుంచకుంటిమి…
బ్రతక నేర్పిన లింగమా…మనసార పూజించకుంటిమి…
పట్టుకెళ్ళని సంపదలకై పరుగాపకుంటిమి…
వెంటరాని బంధాలకై ప్రాకులాడుతూ వుంటిమి…
ఆత్మ నిను చేరు వరకూ చావకున్నది ఆశ ఏం చోద్యమో…
కర్మ ఫలములు తీరాక ఆత్మ నుంచవు దేహమున  ఏం చిత్రమో…!!అత్యంత!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం..రక్ష మాం..సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top