దేవీ..దుర్గా భవానీ…

దేవీ..దుర్గా భవానీ…
హే మాతా…శంభో శివాని…
తల్లీ…జగమేలు జననీ…
ప్రణమిల్లనా నీ ఎదుట శ్రీపావని…
తీర్చవే నా తల్లి ఈ ఒక్క మనవిని…
దయచూపితే జన్మంతా పూజించ నుంటిని…!!దేవీ!!

ఏడు లోకాలకు నీవు ఏకైక రాణివే..
సృష్టి సమస్తమునకు నీవు జగదేక మాతవే…
సప్త సంద్రములంత మనసు నా తల్లి నీది…
అమ్మ…నిను కొలిచిన మాకు కొదవుండదేది…
ఈశ్వరీ… ఈశునికి..ప్రియ రాణివే…
పరమేశ్వరీ…భక్తులకు ప్రియ మాతవే…!! దే!!

సౌభాగ్యముల నిలయము నీ ముఖారవిందము….
తల్లి..సౌఖ్యముల విరివనము నీ మందహాసము…..
వాన చినుకల్లె నీ నగవు హాయి గొలుపు…
ఆ నగవు చినుకు తుంపరలతో మా శివుని మదిని తడుపు…
శాంకరీ…ఈశ్వరుని సహవాసినీ…
తల్లి భ్రామరీ…మా మదినందు నిన్నుంచనీ…!! దే!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరీ...రక్ష మాం…రక్షమం..సర్వేశ్వరా రీ…

Leave a Comment

Scroll to Top