నిరాడంబర దైవమా….
దిగంబర శివలింగమా….
పార్వతీ హృదయంగమా…
రేపవలు కొలుతును జంగమా…
ప్రసాదించుము భక్తి నాకు మిన్నగా నిను కొలువగా….
ఆనతివ్వుము నీవు నాకు నీ గుడి గడపనై నేనుండగా….!! ని!!
కోట్ల మంది ఆర్తితో నిన్నేక కాలమున పిలిచినా…
ఆ కోట్లమందికి చేరువౌవుతవు ముల్లోకముల ఎక్కడుండినా…
లక్షలాది భక్తులెల్లా కరుణించమని ప్రార్ధించెనా….
నువు లెక్క పెట్టక వరము లిచ్చి ఆదుకుందువు చప్పున….
నీ చరణాలకు చుట్టుకున్న ఆదిశేషు నవ్వనీ…..
నీ పద ఘటనలే ప్రాణమైన నీ పద మువ్వలగా మిగలని…!! ని!!
కర్మఫలముల పంజరాన బందినై నేనుంటిరా….
చెరసాల నుండి బయటపడగ దిక్కు నీవనుచుంటిరా…
వినిపించుకుంటే చాలు శివా నా వేదనల నివేదనా…
భావించుకుంటే చాలు శివా నీ భక్తుడని ప్రతి క్షణమున….
రచన చేస్తూ తెలుపుకుందును నాలోని భక్తిని కవితగా…
ఆలపిస్తూ…కలిసిపోతును నీ పైన భక్తిని పాటగా….!! నిరా!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్షమాం…రక్షమాం…