పద్మనాభా…పరంధామా…
నా నోట నీ స్మరణ చేయించుమా….
కమలనయనా…పురుషోత్తమా…
నీ పాద దాసునిగా భావించుమా…
జార విడువను నేను ఏ ఒక్క క్షణము….
నిను తలచుకుంటూ గడిపేను క్షణము క్షణము…!! ప!!
కస్తూరి తిలకమును తిలకించుతూ…
బంగారు వదనమును పరికించుతూ….
మోహనాంగా…నిన్ను పూజింతునయ్యా….
విఠల పాండురంగా…నిన్ను సేవింతునయ్యా….
విహరించనీ నన్ను వైకుంఠపురమున….
నివసించనీ నన్ను నీ పాదాల చెంతన….!! ప!!
“నారాయణా” అని పలుమార్లు పలుకుచూ…
అణువణువునా ప్రహ్లాదుడు నిను చూసుకొనుచూ….
నీ గానామృతమున తాను తడిసి ముద్దాయనే….
లోక కల్యాణము కొరకు తన తండ్రి బాటనే వీడెనే….
దుష్ట శిక్షణ చేయ అవతరించేవు…
శిష్ట రక్షణ కొరకు పాటుపడతావు…!! ప!!
పాహిమాం..పాహిమాం…పంకజాక్షీ ప్రియుడ పాహిమాం…పాహిమాం…రక్షమాం..