ఓం సదా శివా…శివ శంకరా…

ఓం సదా శివా…శివ శంకరా…
ఇల దిగాలుగున్నది కానరా…
హే ప్రభో శివా… అభయంకరా…
అభయ హస్తాన్ని అందించ వేగ రా…
పొర్లు దండాలతో నిను మొక్కేము రా….
ఎన్నిసార్లైన నీ గుడికి వచ్చేమురా…
శివం శివం శివ గంగాధరా…
ఓం హరోం హరోం శివ శంభోహరా…!!ఓం!!

నిస్తేజం తో నిండివున్నది సర్వం సమస్త లోకం….
నిర్వీర్యంగా ఉండిపోయినది నీతో కాలేక మమేకం….
జవసత్వాలు కోల్పోయినది నీ దయ పొందగ లేక….
అమరత్వానికి దూరమైనది నీపై దృష్టిని పెట్టక….
శివం శివం శివ మన్నించరా…
ఓం హరోం హరోం మము కరుణించరా….!!ఓం!!

బీడు భూమిలో గడ్డిపరకలం పనికిరాము నీ సేవకు….
మోడు వారిన శిథిల కొమ్మలం పూలివ్వలేము నీ పూజకు…
ఆశలు ఆవిరి అవుతున్నాయి ఇవ్వ చూపు నీ హస్తము…
నీవే శ్వాసగ బ్రతుకుచుంటిమి తెరువయ్య నీ మది ద్వారము…
శివం శివం శివ పార్వతీశ…
ఓం హరోం హరోం దయ చూపు మహేశా…!!ఓం!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top