హరీ…లక్ష్మీపతి…
శ్రీ హరీ…నిను గాంచితి…
దారే నిన్నడిగితి…
దరి చేరు మార్గమే నే కోరితి….
మధుసూదనా… మాపైన దయవుంచవయ్యా….
యదు భూషణా…ఎదలందు కొలువుండవయ్యా…!!హ!!
అల లక్ష్మీ హృదయాన స్థిరపడితివి…
తను కలగన్న కలలన్ని పండిస్తివి…
శివ ధ్యాన ప్రియుడవై అలరిస్తివి…
హరుని సాంగత్యముతో మాకు వరమైతివి…!!హ!!
కేశవా… తులసి దళ పూజలను అందుకొనవా…
మాధవా…మధుర ఫల నైవేద్యములను పుచ్చుకొనవా…
నారాయణా…అనిన నావాడివందువు….
గోవిందా… అనిన కాపాడునందువు…
శయన మూర్తీ..శయనించు మనసులో….
సుగుణ కీర్తీ…కరుణించవా క్షణములో…!!
హ!!
పాహిమాం…పాహిమాం…నారాయణా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…శివ కేశవా రక్ష మాం…