కోట్లాది గంటలతో…
పలు కోట్లాది ఢమరుకములతో…
వినిపించనా మంత్రాలు విశ్వేశ్వర…
నిను పూజించనా సుమములతో శివ శంకరా…
కైలాస గిరులన్ని కదలి ఊగేలా…
నీ మనసు కరిగి వరమియ్య సిద్ధపడేలా…!!కో!!
అజరామరం నీ పూజా విధానం..
అనిర్వచనీయం నీ మౌన ధ్యానం…
ఆత్మ లీనమై పోవు నీ ధ్యాసలో…
జన్మ మమేకమై పోయి ఆ క్షణములో…
అనిపించునపుడు కైలాసమందు నేనుండినట్లు….
వినిపించునపుడు ప్రమథ గణములు నిను పొగడుచున్నట్లు….!!కో!!
శివా…మాయ చేసేవేందుకో ప్రతి మన సుని….
హరా…నీ మాయ మర్మములెరుగని ప్రతి జన్మనీ….
ధార పోసేలా ప్రతి ఒకరు తమ జీవితం…
నీవు చేస్తావలా అందరినీ అది నీ అభిమతం…
నిటలాక్ష..నిను కొలువ ఎల్లరూ సద్గుణులు అవుతురు…
సదా రక్షించమని ప్రార్థించి వర సిరుల సంపన్నులవుతురు…!!కో!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం..రక్ష మాం..సర్వేశ్వరా రక్ష మాం…