జననీ…జంగముని సగభాగినీ…
పరమ పావనీ…పరమేశ్వరుని ప్రియ భామినీ…
అందాల నీ నగవు అలరించె శివుని…
నీలాల నీ కనులు మురిపించె హరుని…
కదల సిద్దముగ నున్నాడు శివుడు నీ పిలుపుకి…
కలిసి ప్రణయ తాండవము చేయ ఈ మునిమాపుకీ ….!!జననీ!!
అపరంజి బొమ్మా ..అడుగేయవమ్మా…
నీ విభుని చెంతకు చేర తరలి రావమ్మా…
ఓ వెన్నెలమ్మా…శివుని మది జాజి కొమ్మా…
నీ ప్రభువుతో కలిసి నాట్యమాడరావమ్మా…
తెచ్చాము పల్లకిని నిన్ను కొనిపోవ…
తల్లి..కరుణించి కాదనక మాతోటి రావా…!!జననీ!!
కోయిలమ్మలు రాగాలు మిము చూసి నేర్వ…
మయురాంగనులు మిము చూసి నాట్యాలు నేర్వ…
ఆడరే..మా తల్లి…ఆనంద తాండవం…
కలిసి చూడరే ప్రణయాల ప్రేమ తీరం…
పార్వతీ పరమేశ్వరుల అనురాగ సంగమం…
తల్లి…సకల లోకాలకు కల్గు శుభమంగళం…!!జననీ!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరీ పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరీ రక్షమామ్..