శంకరుండతడు….

శంకరుండతడు….
సర్వాంగ సుందరుండతడు…
ఈశ్వరుండతడు….
ఇష్ట కామ్యములన్నిటిని సిద్ధించునతడు….
కనిన వారెల్ల గుండెలో గుడి కట్టురతనికీ….
కలలు కన్న వారెల్ల మనసునర్పించు హరునికి…!!శంకరుండ!!

శివా అను పిలుపుకే వశమవునునతడు….
ఓం నమః శివాయ అనిపిలిచితే కనులముందుండు శివుడు…
వేదనా గీతములు తన చెవిన పడెనా…
ఆవేదనాభరితముగ ఎవరాలపించినా…
సత్వరం స్పందించి కరుణించు నతడు….
తనని నమ్ముకొని పూజించు భక్తులను హరుడు…!!శంఖ!!

మంత్ర పఠనమునకు మహదానందము చెందు వాడతడు…
మంగళ హారతులకే మురిసి వరమిచ్చునతడు….
పూజాధికాలకు తాను సంతృప్తి చెందెనా…
మంత్రోచ్ఛరణలకు తాను ముగ్ధుడైన…
మన ఇంటి పూజగదినిక దాటి పోలేడు…
మన పూజలందుకొన కొలువుండు శివుడు….!!శంకరుండతడు!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం..రక్ష మాం…సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top