మానవా… ఓ మానవా…
నీ స్వార్థ చింతన ఇక మానవా…
ఏలరా… నీకేలరా….
ఆ మంకు తనము నీకేలరా….
కానరా…శివుని కానరా….
నీపై జాలి పడిన ఆ హరుని కానరా…!!మా!!
ఎందుకోయి ఆ ఆరాటం…
దేనికోయి నీ పోరాటం…
తీరదోయి నీ ధన దాహం….
తగ్గ దోయి ఆ వ్యామోహం…
సాంత్వన లేని బ్రతుకును గడిపి సాధించేదేముందిర….
ఆ ఈశుని మరచి వెతలకు వగచి పాపాలకు నెలవైనావురా…!!మా!!
తెరవవోయి నీ కన్నులను…
పట్టవోయి శివ చరణములను…
మరువకోయి శివ నామమును…
నువు కొరకోయి మరుజన్మమును…
ఇక నీపై పడురా ఆతని దృష్టి కర్మలు తొలగేదాకా….
ఆపై నీవే సుమమై పూజకు నోచి నువ్వవుతువు సిగలో వంక…!!మా!!
పాహిమాం..పాహిమాం..శంకరా శివా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం… అభయంకరా హరా రక్ష మాం….