కాలమా క్షణమాగవే….
కనులార శివుని కననీయవే….
మేఘమా గర్జించవే….
కైలాస శిఖరముపై వర్షించవే….
తిలకించనీ శంకరుని గంగ స్నానాలలో…..
ననుగాంచనీ ఈశ్వరుని వివిధ రూపాలలో….!! కా!!
పట్టువస్త్రములనిచ్చి పరమేశ్వరుని కొలుచుకోవాలి….
ధూప హారతుల నిచ్చి దయామయుని వేడుకోవాలి….
నాగహారతినిచ్చి నాగేశ్వరుని వేడుకోవాలి….
తీపి నైవేద్యములనిచ్చి త్రినయుని సేవలను చేసుకోవాలి….
అందుకే కాలమా…క్షణమాగమంది…
ఓ మేఘమా…నిన్నందుకే వర్షించమంది…..!! కా!!
శివుని పూజలు చేయ చిత్తము తల్లడిల్లె….
హరుని సేవలు చేయ వాంఛలు ఫరిడవిల్లె….
వచ్చునో రాదో మరల ఈ క్షణము…
నను చేయనీ భవహారుని పూజ తక్షణము….
అందుకే కాలమా…నిన్నాగమన్నా…
ఓ మేఘమా నిన్నందుకే వర్షించమన్నా….!! కా!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం….రక్ష మాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…