కాళమే నీకు ప్రియమాయనా….

కాళమే నీకు ప్రియమాయనా….
శంకరా…కాల సర్పమే నీకు ముదమాయనా….
బొట్టుగా చేశావు నీ లలాటమునకు…
పూల హారముగ చేశావు నీ నీల కంఠమునకు….
శివా…నీ తనువు తనకాయే ఆవాసము….
ఆహా…ఎంత విశాలమో కదా నీ హృదయము….!! కా!!

భక్తి కనబరచితే చాలు ప్రాణి ఏదైననూ….
తన లోని ఆర్తి చూపిన చాలు క్షణమైననూ….
రక్ష గుందువు నీవు ఆగలేక…..
మోక్షమిస్తువు నీవు ఉండలేక…..
ఆ భాగ్య మొందాలనీ నేను ఏనాటికైనా….
నీ కరుణ దాహార్తినైవున్నాను రవి చంద్ర నయనా….!! కా!!

భక్తి నివ్వరా నీ పూజ చేసేందుకు….
నాకు శక్తి నివ్వరా నీ సేవ జరిపేందుకు….
నీ ఆజ్ఞ లేనిదే నాలోన భక్తి జనియించునా….
నీ కరుణ లేనిదే నా లోన శక్తి ఉద్భవించేనా….
పరమేశ్వరా….పాహి పాహి అంటి వరమియ్యరా….
గంగాధరా…సాగిలపడతానంటి కరుణించరా….!! కా!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం….

Leave a Comment

Scroll to Top