భీకరం శంకరం….

భీకరం శంకరం….
భీతావహం ఈశ్వరం….
శివా… శాంతమొందు…
ఓ హరా…దండమందు…
రుధిర నేత్ర రుద్రా ప్రణమిల్లినాను కానరా….
హే ఫాలనేత్ర భద్రా కరుణించమంటి శంకరా…!!భీ!!

లోకాలను పాలించే జంగమ శివ శంకరా….
మాపై అలకేలరా ప్రభో పార్వతీశ్వరా….
కాలములను నడిపించే కామాక్షీ వరహరా….
కారుణ్యము చూపకుంటే మేమేమవ్వాలిరా….
వందనం…వందనం..ఇది మా నీరాజన వందనం….
శాంతివంచవయా శంకరా…నీకు మేమవుతాం హారతులం…!!భీ!!

సృష్టి స్థితి లయకారా కోపమాపుకోరా….
నీ దృష్టి పడకపోతే మా జన్మ వృథా శంకరా…
సకల ప్రాణికోటికి ఆ జీవ నాడి నీవే…
నీవు ఆగ్రహిస్తివంటే మా కనుల గంగ చెరువే….
శరణం…శరణం..శరణాగతిం శివం…
ప్రసన్నమవ్వు శంకరా…నీ పాద దాసులం….!!భీ!!

పాహిమాం…పాహిమాం..పార్వతీ శివం…రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top