మనిషీ… ఓ మనిషీ….
నువు కావాలయ్యా ఋషి…
ఆ శివుడే నీలో ఉషస్సు…
నువు చేయక తప్పదు తపస్సు…
కాలం తెలియక ఉనికిని తెలుపుతూ చేయాలయ్యా ధ్యానం…
ఏ కోరికలడగక తనలో కలవగ పూజించాలి నువు నిత్యం…!! మ!!
ఎదిగే కొద్దీ పెరిగిపోయేరా సిరులపైన ఆరాటం…
వనరులు నీకెన్ని కూర్చినా చూపలేదు ఆ తండ్రి పైన విశ్వాసం…
నీచరితలో భక్తే మృగ్యం….
నీ బ్రతుకుకు లేదొక గమ్యం….
ఈ నేల పైన జీవించడానికి ఉన్నదా నీకు హక్కు…
ఇప్పుడయినా నువు కనులు తెరిచితే హరుడవును నీకు దిక్కు…!! మ!!
బ్రతకడమే నీ లక్ష్యమంటూ నువు చేయుచుంటివి తప్పులు…
ఎట్లైనా గడిపెయ్యాలని గాడి తప్పినవి నీ నడకలు…
అది కాదుర జీవిత లక్ష్యం…
నీ జన్మకు లేదుర పరమార్థం….
తప్పు తెలుసుకొని కాళ్ళు పట్టుకో ఈశుడు ఇచ్చును మోక్షం…
తను గొప్ప మనసుతో చేర దీసుకొని నీకిచ్చును మదిలో స్థానం…!! మ!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…