ప్రభో శంకరా…ఆది మధ్యాంత రహితా….
హే శివా…గంగాధరా…సకల ప్రాణికోటి దాతా…
పాహి పాహి అంటి పరమేశ్వరా…
మాం..పాహి పాహి అంటి నాగేశ్వరా…
నీ దర్శన భాగ్యముతో జన్మ ధన్యమాయే….
నీ సౌందర్య వీక్షణముతో పాప హరణమాయే….!!ప్రభో!!
హృదయమందున నిలిపాను నీ రూపునీ…..
నా మనసుతో చేశాను నీ పూజనీ….
భువిన ఉన్నన్నాళ్ళు ఇట్లాగే చేయనీ…
బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ సేవలే చేయనీ…pr
శివా…శివా…అంటూ నీ గుడి చుట్టూ తిరగని….
నాకు పదే పదే నీ గుడికి రావాలనిపించనీ…!!ప్రభో!!
అభిషేకములు చేస్తూ పులకించ బూనితి….
నీకు పట్టు వలువలిస్తూ తరించ బూనితి….
సదా శివా…నా సేవలకు విలువ కట్టకయ్యా…
ఓ మహా శివా..నీవే నా లోకమైతే అదే చాలునయ్యా….
శివా…శివా అన్న పదం నాకు ప్రాణ ప్రదం కానీ…
వేన వేల సార్లు పలికినా ఇంకొక్క సారి పలుకు వరం పొందనీ…!!ప్రభో!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్షమాం…రక్షమాం..