శరణంటిని శంకరా…
శీఘ్రముగా కావరా…
మొక్కొంటిని శంకరా…
నాపై దయ చూపరా…
ఆకలి దప్పులు మరచి చేతునయ్య పూజలు….
నా కల తీరేదాకా ఆపనయ్య సేవలు…!! శర!!
తెచ్చినాను పూజించ జాజి పూల దండలు….
తీసుకవచ్చినాను అర్పించ పండ్లు ఫలహారములు….
మెచ్చి నీవు ఇవ్వయ్య నా భక్తికి దీవెనలు…
శివా…ఏమిచ్చుకున్న తీరనివే నీ ఋణముల భారాలు…
శంభోహర శంకరా….నీ కరుణకు అంతేదిరా….
కాశీపుర హరహరా…నీ కృపకు పాత్రుడవుతురా….!!శర!!
గాలినిచ్చి మాకు నీవు ప్రాణవాయువైతివి….
త్రాగు నీటినిచ్చి మాకు నీవు ప్రాణదాతవైతివి…
వెలుగునిచ్చి లోకమందు చీకట్లను బాపితివి…
మాకు బ్రతుకునిచ్చి జీవించగా దారులు చూపెడితివి…
శంభోహర శంకరా…ఏమని కీర్తించను….
గంగాధర ఈశ్వరా….నీ దయ సుగుణాలను….!!శర!!
పాహిమాం…పాహిమాం…పార్వతీశ పాహిమాం…రక్షమాం..రక్షమాం..