మందస్మిత శంకరా….
మహిమాన్విత దేవరా…
దర్శించితి ఈశ్వరా…
నా రాత మార్చు భవహరా…
నేనొక జామ ఫలమునవుతా నీ పుణ్య ఫలము నివ్వు….
నీకొక పూల మాలనవుతా నా కర్మ తొలగనివ్వు…!!మంద!!
ఎత్తినాడు లంకేశుడు కైలాస శిఖరము….
నేను ఎత్తలేదు కడకు చరణాల చెంత సుమము….
చేసినాడు రావణుడు ఘోర తపములు…
నేను చేయలేదు మనసారా నీ నామ జపములు…
అట్లాగని ఇవ్వకుండ ఉండబోకు వరము….
నిన్ను సదా తలచుకుంటా నమ్మివ్వుమయ్యా అభయము…!!మంద!!
చూపలేను నీకు మార్కండేయ భక్తిని….
నేను చూపగలను నీకు నా కనుల ఆర్తిని….
ఉండలేను ఎదురుగా నీ నంది మాదిరి…
నిన్ను కొలుచుకుందునయ్యా మా తండ్రి మాదిరి….
సదా నీదు సేవే కానివ్వు నా విధి….
ఎన్ని జన్మలు నేనెత్తిన నీ ఋణమూ తీర్చలేనిది…!!మంద!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్షమాం…రక్షమాం…