ఫాల నేత్రా శివా పాహిమాం…పాహిమాం…

ఫాల నేత్రా శివా పాహిమాం…పాహిమాం…
రుద్రరూపా హరా రక్షమాం…రక్షమాం…
లింగముగ ఉంటూనే భోగములనిస్తువు…..
మౌనముగ వింటూనే బాధలను తీర్చేవు…
నందివాహనా…నీ మనసెంత గొప్పదో చెప్పగా….
నేను తగుదునా వర్ణింప నీ ఘనతెంతో చాటగా….!!ఫాల!!

అల కైలాస శిఖరాన కూర్చోని నీవు…
సృష్టి రక్షణ చేయ పాటు పడుతున్నావు…
ఇచట భూలోకమందు నిను మరచి మేము….
స్వార్థాల మురికి కూపాలలో బ్రతుకుచున్నాము….
కనులు తెరిచే సమయమాసన్నమయితే…
తక్షణము మా మనసు నీకు వశమైతే….
అవధులెరుగని ఆనంద బాష్పాలు వరదలై…
పారవా నీ శిరముపై గంగ జలముల ధారలై…!! ఫా!!

అర్థాంతరముగ వాన కురిసెళ్ళినట్లు….
ఆపత్కాలమున ఆదుకుంటావు మేము కోరుకున్నట్లు….
అవశ్యముగ మేము బయటపడునట్లు….
ఆదరించేవు నీవు మా బంధువైనట్లు….
ఓ ఆత్మబంధూ… హద్దులెరుగని ప్రేమ నీ ఆస్తిపాస్తులు…
హే…దీనబంధూ…నీ దయకు ఎన్ని చేస్తే తీరేను ఉపవాస దీక్షలు…!!ఫాల!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్షమాం..రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top