గణపతి దేవా కావుమయా….
పార్వతి సుత దయ చూడుమయా…
స్కందుని సోదర కొలుతుమయా….
మా విఘ్నములను కడతేర్చవయా….
గణ గణ గణపతి రావయ్యా…
శుభ గణపతి వరముల నీవయ్య…!!గణ!!
తల్లికి కాపలా కాచితివి….
నీ తండ్రికి ఎదురుగా నిలిచితివి…
తల్లి మాట నిలబెట్టితివి…
నీ తలనే ఫణముగ పెట్టితివి…
ధీర శాలివనిపించుకొని..
గజ శిరమును వరముగా దాల్చుకొని….
దివికే దైవం అయ్యావు..
ఈ భువికే ప్రాణం అయ్యావు….!!గణ!!
కొలుచుకున్న నీ రూపమును…
మాకడ్డురావు ఏ విఘ్నములు…
చేసుకున్న నీ పూజలను…
మా దరికి రావు ఏ కష్టాలు…
పత్రి పూజకే ముదమొంది…
నువ్వివ్వు గణా మది కోరింది…!!గణ!!
పాహిమాం…పాహిమాం…గణపతి పప్పా పాహిమాం…రక్ష మాం…రక్షమాం…మోదక హస్తా రక్ష మాం…