అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా…
బ్రహ్మాండమంతటిని పాలించు ఏలికా….
ప్రభో…ఏమందు సౌందర్య వైభవములను…
హరా…కనువిందు కాగలదు ఏ కనులకైననూ….
పొగడ దేనితో పోల్చలేక…
స్వరము మూగదాయ శివా.. నిను గాంచినాక…
హే శంకరా… వరమివ్వు వ్రాస్తాను నీ శతకము…
మహా కాళేశ్వరా…దయచూపు పలికెదను నీ దండకం…!! అఖిలాండ!!
పెరిగేను నీపైన భక్తి వెయ్యింతలు….
శివా…మమ్ములను దీవించి చల్లయ్య అక్షింతలు…
కలిగేను నీపైన ఆర్తి కొండంతలు…
హరా…నీవు కరుణిస్తే చాలయ్య గోరంతలు…
ఏ వరము నిచ్చినా గైకొనగ సిద్దముగ నుంటిని….
నీవు ఏదారి చూపిన నడవ బద్ధుడగ ఉంటిని…!!అఖిల!!
ఎవరికి సాధ్యమవును నిన్ను వర్ణింప….
ఏ కవికి చేతవును నీ కీర్తి రచియింప…
ఎవరు కనగలరు నీ ఆది మధ్యాంతము….
ఎవరు చెప్పగలరు నీ జన్మ రహస్యము…
ప్రకృతిలో నున్న నిన్ను మనసుతో చూడగలరు…
ఆ మనసు మంచిదైతేనే వారు నిను చేరగలరు…!! అఖిలాండ!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్షమాం…రక్షమాం..