అమ్మోరు నా తల్లి మా పూజలందుకో…

అమ్మోరు నా తల్లి మా పూజలందుకో…
శివుని సగమేను తల్లి మా సేవలందుకో….
అనురాగవల్లి మా హారతులను అందుకో…..
హరుని మనసైన మరుమల్లి మా  వ్రతములను అందుకో…
అందుకొని కృప చూపు కాత్యాయనీ…
మమ్మాదుకొని దయచూపు శివకామినీ…!!అమ్మోరు!!

వినిపించుకోవమ్మ మా పిలుపులు…
పంపించు నా తల్లి నీ పిలుపులు….
వేయించుకోవమ్మ నీ గుడి వైపు అడుగులు…
వేయించితే ఒత్తేము నీ అడుగులకు మడుగులు….
కాశీ విశాలాక్షి కరుణించవే….
మధుర మీనాక్షి మాయమ్మ దీవించవే….!!అమ్మోరు!!

కనులకానందమవునమ్మ నిను గాంచిన…
మనసు నిర్మలమవునమ్మ నిను తలచిన…
చిటికెలో చింతలే దూరమై పోవు…
ఒక్క క్షణములో వేదనలు మాయమై పోవు….
హే..చండికా చంద్ర హారాధరీ…
మమ్ము కరుణించవే మందార మాలాధరి…!!అమ్మోరు!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరీ...రక్షమాం… రక్ష మాం… సర్వేశ్వరీ…రక్షమాం…

Leave a Comment

Scroll to Top