పూయరే గంధమును పరమేశ్వరునికి….

పూయరే గంధమును పరమేశ్వరునికి….
చల్లరే సుగంధములు పార్వతీశునికి…
పలుకరే మంత్రాలు పలుమార్లు తనకి…
అందివ్వరే నైవేద్యములు మన సాంబశివునికి….
రుద్రాక్ష ప్రియునికి రుద్రాలు చదువుతూ….
ప్రస్తుతించెదము సీస పద్యాలు పాడుతూ…!!పూయరే!!

తరతమ బేధాలెరుగని తండ్రి తానతడు….
జాతి మతములనెరుగని జంగముడు అతడు…
తనకి దీవించుటే తెలుసు ఎవరినైనా….
భక్తునిగా భావించుటే తెలుసు ఏ ప్రాణి నైనా….
ఏ కంట నీరున్న శివుడాగలేడు…
ముక్కంటి తానొచ్చి మనకున్న వ్యధలాపగలడు….!! పూయరే!!

పాదాల చేరి నీవు శిరమొంచి నిలువు….
నిన్ను మన్నించి నీ ఇంట తానుండు కొలువు….
పుష్పాలనర్పించి ప్రియమార పిలువు….
శివుని ఆశీస్సులను పొంది తనకి ఆత్మీయుడవవుతవు…
భక్త సులభుడు హరుడు భ్రమరాంబికా విభుడు…
నిన్ను రిక్త హస్తములతో పంపడు శివుడు తానెప్పుడూ….!!పూయరే!!

పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా అనరా….రక్షమాం…రక్షమాం..రక్షించ మని కోరరా…

Leave a Comment

Scroll to Top