నీ చరణ దాసుడను నేను శంకరయ్యా…

నీ చరణ దాసుడను నేను శంకరయ్యా…
నీ పాద పద్మములు నాకు గమ్యమయ్యా….
నీ నిత్య సేవకుడిని నేను ఈశ్వరయ్య….
నగ్న సత్యమిది నీవు నమ్మవయ్యా…
ఈశ్వరా…ఏ పాటు పడకుండ రక్షించమంటిని….
నీవు ఏ పాటి వరమిచ్చినా అందుకొననుంటిని…!! నీ!!

నా కనులు కార్చే జలములో నీ సిగనున్న గంగ కానొచ్చురా….
నాపైన మనసు పెడితే నీ నామ స్మరణ వినవచ్చురా…
చూడనుంటే నా భక్తి లోతు చూడొచ్చురా….
ఇవ్వనుంటే ముక్తి మురిసి ఇవ్వొచ్చురా….
సారించు ఒకసారి నీ చూపు నాపై…
నీవు స్థిరముగా వుంటావు నాలోన ఇకపై…!!నీ!!

నీ నీడలో నన్ను గూడు కట్టుకొననివ్వు…..
నీ కనుచూపు మేరలో నన్ను జీవించనివ్వు….
నీ ఆదరణలో నేను సేద తీరాలి…
నీ సాంగత్యముతో నేను తాపసవ్వాలి….
సారించితే నీ చూపు ఒకసారి నాపై…
నన్ను నడిపించెదవు నటరాజ నీవైపు ఇకపై….!!నీ!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం….

Leave a Comment

Scroll to Top